
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రిలీజ్ రోజునే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వరల్డ్‌వైడ్‌గా 500 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తున్న ఈ సినిమా, కేవలం తెలుగు వెర్షన్‌లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు అందుకుంది.
తాజా లెక్కల ప్రకారం, తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ కలిపి తెలుగు వెర్షన్ వసూళ్లు ఇప్పటికే 80 కోట్ల గ్రాస్‌ను దాటేశాయి. ఇది రజినీకి తెలుగులో మరోసారి భారీ మార్కెట్ ఉందని నిరూపిస్తోంది. ముఖ్యంగా, జైలర్ తరువాత మళ్లీ ఇంతటి కలెక్షన్ సాధించడం ప్రత్యేకతగా మారింది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, మంచి టాక్ దక్కి ఉంటే తెలుగు వెర్షన్‌లో జైలర్ రికార్డులను కూడా ఈజీగా అధిగమించేదని చెబుతున్నారు. అయినప్పటికీ, ఈ స్థాయి వసూళ్లు రావడం రజినీ స్టార్‌డమ్‌కు మరో నిదర్శనం.
సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా, నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ వంటి స్టార్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ మల్టీ-స్టారర్ అట్రాక్షన్ కూడా కలెక్షన్లపై ప్రభావం చూపింది.