Saturday, October 10, 2026
HomeTelanganaసీఎం చేతులమీదుగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం

సీఎం చేతులమీదుగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం

CM-INAUGURATES-YOUNG-INDIA-POLICE-SCHOOL

తెలంగాణ: సీఎం చేతులమీదుగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం

మంచిరేవులలో విద్యా రంగానికి మరో మైలురాయి

తెలంగాణ (Telangana) ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకంగా రూపొందించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (Young India Police School) ప్రారంభోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy) మంచిరేవుల (Manchirevula) గ్రామంలో గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన ఈ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారికంగా ప్రారంభించారు.

ప్రారంభ కార్యక్రమంలో కీలక నాయకుల హాజరు

మంత్రి ధర్మారెడ్డి శ్రీధర్ బాబు (D. Sridhar Babu), ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy)తో కలిసి సీఎం పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్లాస్‌రూంలను పరిశీలించిన అనంతరం, చిన్న పిల్లలతో కలిసి ఫుట్‌బాల్ ఆడి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

స్కూల్‌కు అన్ని వసతులు అందిస్తాం: సీఎం హామీ

పోలీస్ స్కూల్‌కు అవసరమైన అన్ని వసతులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక లోపాలను గుర్తించి, అవి తిరిగి పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

“యంగ్ ఇండియా నా బ్రాండ్” – సీఎం వ్యాఖ్య

ప్రతి ముఖ్యమంత్రికి ఒక గుర్తింపు ఉంటుందని వ్యాఖ్యానించిన సీఎం… ఎన్టీఆర్ (N. T. Rama Rao) కిలో బియ్యం, చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ఐటీ అభివృద్ధి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y. S. Rajasekhar Reddy) ఆరోగ్యశ్రీ లాగా, తన బ్రాండ్ యంగ్ ఇండియా అని పేర్కొన్నారు. సైనిక్ స్కూల్ మాదిరిగా పోలీస్ స్కూల్‌ను తీర్చిదిద్దే దిశగా పావులు కదుపుతున్నామని తెలిపారు.

విద్యా నాణ్యతపై ఆందోళన

బీటెక్ పూర్తి చేసిన యువత ఉద్యోగాలకు అర్హత సాధించలేకపోతున్న పరిస్థితిని ప్రస్తావించిన సీఎం… విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-స్కూల్ విధానం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

క్రీడలకు ప్రాధాన్యత, ఒలింపిక్ విజన్

పోలీస్ స్కూల్ ద్వారా క్రీడలకు పెద్దపీట వేస్తామని సీఎం తెలిపారు. చిన్న దేశాలు ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించగలగడం చూస్తే, మన దేశం ఎందుకు సాధించలేకపోతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ స్కూల్‌ను దేశంలో ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular