
న్యూస్ డెస్క్: సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం పొందిన మాజీ సీఎం జగన్‌ను, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిగమిస్తున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ‘పీఆర్ఎస్ స్టేట్ ఫైనాన్స్ రిపోర్ట్ 2025-26’ ప్రకారం, సంక్షేమ కేటాయింపుల్లో కూటమి ప్రభుత్వం వైసీపీ రికార్డులను బద్దలు కొట్టింది.
ఈ నివేదిక ప్రకారం, కూటమి ప్రభుత్వం తమ బడ్జెట్‌లో ఏకంగా 38% నిధులను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసమే వెచ్చిస్తోంది. ఇది జగన్ హయాం (2022-24) నాటి కేటాయింపుల కంటే 6 నుంచి 8 శాతం అధికమని తేలింది.
కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమాన్ని ఆపేస్తారని వైసీపీ చేసిన విమర్శలకు భిన్నంగా, చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తున్నారు. పెన్షన్లను రూ. 4 వేలకు పెంచడం, ‘తల్లికి వందనం’, ‘స్త్రీశక్తి’ (ఉచిత బస్సు), ‘అన్నదాత సుఖీభవ’ వంటి పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయి.
ఐదేళ్లలో బటన్ నొక్కి రూ. 2.7 లక్షల కోట్లు పంచామని జగన్ ప్రచారం చేసుకోగా, చంద్రబాబు కేవలం 16 నెలల పాలనలోనే ఆ సంక్షేమ వ్యయాన్ని అధిగమించే వేగంతో దూసుకెళ్తున్నారని ఈ లెక్కలు చెబుతున్నాయి.
కేవలం సంక్షేమమే కాకుండా, జగన్ నిర్లక్ష్యం చేసిన అభివృద్ధి పనులను కూడా చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. కేంద్రం నుంచి ఈ ఏడాది రూ. 7,902 కోట్లు రాబట్టడం ద్వారా, అభివృద్ధి-సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
