
నందమూరి బాలకృష్ణ ఇప్పుడు చేస్తున్న “అఖండ 2” సినిమాపై అభిమానుల్లో మాస్ ఫీవర్ స్పీడ్ పెరుగుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు షేడ్స్‌లో కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే.
కానీ తాజాగా మూడో లుక్ కూడా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇచ్చేలా మూడో లుక్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండేలా బోయపాటి డిజైన్ చేస్తున్నారని టాక్. ఈ లుక్ బహుశా కథలో ఓ టర్నింగ్ పాయింట్‌ను చూపిస్తుందని చెబుతున్నారు.
బాలయ్యకు డిఫరెంట్ అవతారాలంటే ఎలా కట్టిపడేస్తారో “అఖండ”లో చూసినవారికే తెలుసు. ఈసారి బాలయ్య బర్త్‌డే కానుకగా జూన్‌లో ఫస్ట్ లుక్, టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోసారి మాస్ జాతర మోగించేందుకు రెడీ అవుతున్నారు.
ఇక ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ తో మళ్లీ హై వోల్టేజ్ మాస్ బీట్లను అందించనున్నాడు. 14 రీల్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.