fbpx
Sunday, June 8, 2025
HomeMovie Newsఓటీటీలోకి "అర్జున్ సన్నాఫ్ వైజయంతి"… స్ట్రీమింగ్ ఎందులో?

ఓటీటీలోకి “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”… స్ట్రీమింగ్ ఎందులో?

arjun-son-of-vaijayanti-ott-release-prime-video

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మిడ్ ఏప్రిల్‌ విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.

థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంటివద్దే ఈ యాక్షన్-ఇమోషనల్ డ్రామా ఎంజాయ్ చేయొచ్చు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా, విజయశాంతి ముఖ్య పాత్రలో మెప్పించారు.

విజయశాంతి స్క్రీన్ రీ ఎంట్రీకి ఇది మరో మైలురాయిగా నిలిచింది. కళ్యాణ్ రామ్ పాత్రలో థ్రిల్లింగ్ షేడ్స్ ఉండటంతో, ఆయన నటన మరోసారి ప్రశంసలందుకుంది.

ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్, ఎమోషనల్ హైపాయింట్స్ ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular