
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన ఘాటి సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్‌కి రాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడానికి దర్శకుడు క్రిష్‌తో పాటు మొత్తం టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అయితే అనుష్క మాత్రం ప్రత్యక్షంగా ఎక్కడా కన్పించకపోవడం గమనార్హం.
ఇక అందరూ ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొనరని భావిస్తున్న సమయంలో, వేరే రీతిలో తన ఉనికిని తెలియజేస్తోంది. రీసెంట్‌గా ఓ AI వీడియో ద్వారా ఘాటి సినిమాను ప్రమోట్ చేసిన అనుష్క మరోసారి కొత్త పంథాలో కనిపించింది.
రానా దగ్గుబాటితో ఫోన్ కాల్ సంభాషణలో కూడా ఘాటిపై చర్చ చేస్తూ, ఈ సినిమాను గుర్తుచేసేలా ప్రమోషన్ చేసింది. అదేవిధంగా త్వరలోనే ఓ రేడియో ఛానల్‌లో తన అభిమానులతో మాట్లాడేందుకు రెడీ అవుతోంది.
ఈ విధంగా స్క్రీన్ మీద కనిపించకపోయినా, వినిపిస్తూ తన సినిమాకు పాజిటివ్ బజ్‌ను పెంచుతున్న అనుష్క స్ట్రాటజీ అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో ఘాటిపై హైప్ మరింత పెరిగింది.