
న్యూస్ డెస్క్: ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టుకు ముందు ఓవల్ స్టేడియంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య చిన్న గొడవ జరిగింది.
ట్రెయినింగ్ సమయంలో గంభీర్ ఆటగాళ్లతో నెట్స్‌లో ప్రాక్టీస్ చేయిస్తున్న వేళ లీ ఫోర్టిస్ అక్కడికి వచ్చి ఏదో చెప్పగా, గంభీర్‌కు నచ్చకపోయింది. నువ్వు మైదాన సిబ్బంది మాత్రమే, మాకు ఏమి చెప్పొద్దు, అవసరమైతే అధికారులకు ఫిర్యాదు చేయండి అంటూ గంభీర్ కాస్త ఘాటు స్వరంలో స్పందించాడు.
ఈ మాటలు బాగా పెరగడంతో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వచ్చి, క్యూరేటర్‌ను దగ్గరికి తీసుకెళ్లి పరిస్థితిని సమతుల్యం చేశాడు. అయినా కొద్ది సేపు వాగ్వాదం కొనసాగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు గంభీర్‌కు మద్దతుగా, మరికొందరు సిబ్బందిపై ప్రశ్నలు వేస్తున్నారు.
ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ముందుంది, ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత్ చివరి టెస్టు గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.
