
నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ చిత్రం ఇప్పుడు బడ్జెట్ విషయంలో హాట్ టాపిక్‌గా మారింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మైథలాజికల్ ఫిల్మ్‌కి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఇది రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్టు నిర్మాతలు స్పష్టంచేశారు. అయితే ఇప్పుడు దీని బడ్జెట్ వివరాలు బయటకు రావడం సంచలనం రేపుతోంది.
నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం, రెండు పార్ట్స్ కలిపి ఈ సినిమాకి రూ.4000 కోట్లు ఖర్చవుతున్నట్టు వెల్లడించారు. ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలోనే రికార్డు స్థాయి బడ్జెట్.
ఇంత భారీ బడ్జెట్ పెట్టడం అనేది ఇండియన్ సినిమా స్థాయిని కొత్త ఎత్తుకు తీసుకెళ్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కానీ ఈ బడ్జెట్ రికవరీపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. సాధ్యమవుతుందా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
రామాయణ సినిమాపై ఆసక్తి పెరుగుతుండగా, బడ్జెట్ విషయమై వచ్చిన లెక్కలు మరింత చర్చకు తావిస్తున్నాయి.