
పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
అలాగే అదే రోజున బాలకృష్ణ నటిస్తున్న “అఖండ 2” కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో రెండు సినిమాల మధ్య రిలీజ్ డేట్ క్లాష్ మొదలైంది.
చాలామంది అభిమానులు ఓజి వాయిదా పడుతుంది అనే ఊహలో ఉన్నా, మేకర్స్ మాత్రం అదే తేదీన విడుదల చేస్తామని స్పష్టంగా చెప్పారు.
మరోవైపు అఖండ 2 షూటింగ్ ఇంకా కొనసాగుతుండటంతో చిత్ర విడుదలపై అనుమానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం జరుగుతోందని సమాచారం.
ఇకపోతే డిసెంబర్లో అఖండ 2 వస్తుందన్న టాక్ కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటికే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించిన ఓజి టీం తమ ప్లాన్‌పై నిలిచేలా కనిపిస్తోంది.