
ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ‘‘వార్ 2’’లో నటిస్తున్నాడు.
ఈ మూవీ ఇప్పటికే నార్త్ ఇండియాలో భారీ అంచనాలు పెంచగా, సౌత్‌లో ఎన్టీఆర్ ఫ్యాక్టర్ సినిమాకి అదనపు జోష్ ఇస్తుందని టాక్.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రేజ్‌తో ‘‘వార్ 2’’కి ఇక్కడి బిజినెస్ లెక్కలు బిగ్ స్కేల్లో ఉంటాయని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు సినిమా కోసం పోటీ పడుతున్నారట.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి కనీసం ₹80 కోట్లు బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. పెద్ద స్థాయి బయ్యర్లతో చర్చలు మొదలైనట్టు సమాచారం. హృతిక్ రోషన్ బలాన్ని నార్త్‌లో వాడుకుంటే, సౌత్‌లో ఎన్టీఆర్ మాస్ ర్యాంపేజ్ దుమ్ము రేపుతుందన్నది ట్రేడ్ వర్గాల అంచనా.
‘‘వార్ 2’’ అప్డేట్స్ కోసం తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ భారీ మల్టీ-స్టారర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.