fbpx
Sunday, June 8, 2025
HomeMovie Newsగేమ్ ఛేంజర్: ఓటీటీలో హిందీ వెర్షన్ సస్పెన్స్

గేమ్ ఛేంజర్: ఓటీటీలో హిందీ వెర్షన్ సస్పెన్స్

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్ లో విడుదలై నెల రోజులు కాకముందే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చినా, హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యమవుతోంది.

సాధారణంగా ఒకే ఓటీటీ వేదిక అన్ని భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తుంది. కానీ, గేమ్ ఛేంజర్ విషయంలో భిన్నమైన వ్యూహం అమలు చేశారు. హిందీ హక్కులను జీ5 కొనుగోలు చేయడంతో, హిందీలో సినిమాను చూడాలంటే ఆ వేదికను ఎంచుకోవాల్సి వస్తుంది. అయితే, ఇప్పటివరకు జీ5 అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు.

హిందీ మార్కెట్‌లో సౌత్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో, నిర్మాత దిల్ రాజు ఈ ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే, ఈ ఆలస్యం వెనుక వ్యాపార ప్రక్రియలే కారణమా, లేక వేరే స్ట్రాటజీ ఉందా అనే దానిపై ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

థియేట్రికల్ రన్ పరంగా ఈ చిత్రం పెద్దగా వసూళ్లు రాబట్టకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, భిన్నమైన వేదికల స్ట్రాటజీ సినిమాకు ఎంతవరకు కలిసొస్తుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular