fbpx
Friday, June 13, 2025
HomeMovie Newsతమన్నా 'నవంబర్ స్టోరీ' ట్రైలర్

తమన్నా ‘నవంబర్ స్టోరీ’ ట్రైలర్

ThamannaWebseries NovemberStory Trailer

కోలీవుడ్: లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి వెబ్ సిరీస్ లు, ఓటీటీ కంటెంట్ ల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ ట్రెండ్ ని సరిగ్గా ఫాలో అవుతున్నారు సీనియర్ హీరోయిన్ తమన్నా. సౌత్ లో మంచి గుర్తింపు ఉన్న ఈ హీరోయిన్ ఇదివరకే ఆహా వారితో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ’11th హవర్’ అనే ఓటీటీ సినిమాలో నటించింది. ఇది అంతగా గుర్తింపు పొందలేదు. ప్రస్తుతం తాను నటించిన ‘నవంబర్ స్టోరీ‘ అనే వెబ్ సిరీస్ విడుదలకి సిద్ధం గా ఉంది. ఈ రోజు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసారు.

మనల్ని ప్రేమించే వాళ్ళని రక్షించడానికి ఎంత దూరం వెళ్తారు? అనే థీమ్ తో క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఈ సిరీస్ రూపొందింది. ఒక ఫేమస్ క్రైమ్ నొవెల్స్ రచయతగా గణేశన్ పాత్రలో జి.ఎం.కుమార్ అనే తమిళ్ సీనియర్ నటుడు నటిస్తున్నాడు. అతని కుమార్తె పాత్రలో తమన్నా నటిస్తుంది. పెన్నుతో పొడిచి చంపి ఆధారాలు దొరకకుండా పెయింట్ పోసి తప్పించుకున్న ఒక హంతకుడిని వెతికే క్రమంలో పోలీసులు తన తండ్రిని అరెస్ట్ చేస్తారు. తన తండ్రి నిర్దోషి అని నిరూపించుకోవడానికి తమన్నా ఎంత దూరం వెళ్ళింది అనేది మిగతా కథ.

ఈ సిరీస్ మే 20 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది. ఈ సిరీస్ తెలుగు, తమిళ్, హిందీ లో అందుబాటులో ఉండనుంది. ఇంద్ర సుబ్రహ్మణ్యన్ దర్శకత్వంలో
ఆనంద్ వికటన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సిరీస్ నిర్మాణం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular