Monday, July 14, 2025
HomeMovie Newsవార్ 2 నుంచి ఈ వారం ఫస్ట్ సింగిల్?

వార్ 2 నుంచి ఈ వారం ఫస్ట్ సింగిల్?

war2-first-single-this-week

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “వార్ 2”పై ఆసక్తి పెరుగుతోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం భారీ రేంజ్‌లో తెరకెక్కుతోంది.

ఇప్పటికే టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నది – ఫస్ట్ సింగిల్. బజ్ ప్రకారం, ఈ వారం రొమాంటిక్ సాంగ్ విడుదల కావొచ్చని సమాచారం.

ప్రీతమ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర బృందం చెబుతోంది. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ తర్వాత, పాటలపై అంచనాలు పెరిగాయి.

ఈ పాట గురించి ఇప్పటికే సోషల మీడియాలో హైప్ మొదలైంది. అయితే అధికారికంగా విడుదల తేదీ ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్‌ మాత్రం అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు.

వార్ 2 తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆగస్ట్ 14న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. థియేటర్లలో సందడి కావడమేగాక, మ్యూజిక్ ఛార్ట్స్‌లోనూ దూసుకెళ్లే అవకాశం ఉంది.

ఈ సినిమాతో ఎన్టీఆర్, హృతిక్ కాంబోకి బిగ్ రికాగ్నిషన్ రావొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ట్రైలర్ తర్వాత సినిమాపై హైప్ ఇంకింత పెరిగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular