పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సమాయత్తమవుతోంది. జూలై 24న థియేటర్లలోకి రానున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా టికెట్ ధరల కారణంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధర రూ.236గా, మల్టీప్లెక్స్‌లలో రూ.295గా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం ప్రత్యేక అనుమతులపై ఆధారపడి ఉంటుంది.
తెలంగాణలో టికెట్ల రేట్లు మరింత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ సింగిల్ స్క్రీన్ ధర రూ.265.50గా, మల్టీప్లెక్స్ ధర రూ.413గా ఉండవచ్చని సమాచారం.
ఈ ధరలు అధికారికంగా ప్రకటించకపోయినా, ట్రేడ్ వర్గాలు ఇవే ఫైనల్ ధరలుగా భావిస్తున్నాయి. పవన్ సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ పెంపు సహజమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టికెట్ ధరల పెంపు ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతుందా? ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.