
నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న గ్లోబల్ వెబ్‌సిరీస్ “స్ట్రేంజర్ థింగ్స్ 5” చివరి సీజన్‌కి సంబంధించి అంచనాలు పెరిగిపోతున్నాయి. వరల్డ్‌వైడ్‌గా సంచలనం రేపిన ఈ సిరీస్‌కి ఇది ముగింపు కావడం మరింత ఆసక్తిని పెంచుతోంది.
తాజాగా విడుదలైన టీజర్‌లో సీరీస్ గ్యాంగ్ మొత్తం మరోసారి వెక్నా అనే శత్రువును ఎదుర్కొనబోతున్నట్టుగా చూపించారు. ఎల్ మరియు ఆమె ఫ్రెండ్స్ మధ్య బంధం, యాక్షన్, ఎమోషన్ ఈ టీజర్‌లో బాగానే పండింది.
విజువల్స్ కూడా సినిమాటిక్ లెవెల్‌లో ఉండడంతో ఇది ఓ థియేట్రికల్ ఫినిష్ లా ఫీలవుతోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కథకు ఒక గాఢత, ముగింపుకు విలువ ఇస్తున్నట్టుగా టీజర్ చూస్తే అనిపిస్తోంది.
ఈ ఫైనల్ సీజన్‌ను నెట్‌ఫ్లిక్స్ మూడు భాగాలుగా రిలీజ్ చేయబోతోంది. నవంబర్ 27న మొదటి వాల్యూమ్, డిసెంబర్ 26న రెండో వాల్యూమ్, జనవరి 1న ముగింపు ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానున్నాయి.