
ఈ శుక్రవారం టాలీవుడ్ ఆడియెన్స్ ని అలరించడానికి రెండు పెద్ద ఎంటర్టైనర్స్ రిలీజయ్యాయి. సమంత నిర్మాతగా, చిన్న క్యామియోలో నటించిన శుభం, అలాగే యంగ్ హీరో శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన సింగిల్ సినిమాలు బరిలోకి దిగాయి.
ప్రేమియర్స్ నుంచే ఈ రెండు సినిమాలకీ మంచి టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక, యూఎస్ మార్కెట్లోనూ వీటికి ఆకట్టుకునే ఓపెనింగ్స్ లభించాయి. శుభం సినిమా యూఎస్ లో $75,000 పైగా గ్రాస్ చేసిందంటే, సింగిల్ సినిమా అయితే $150,000 పైగా గ్రాస్ తో మరింత ముందంజలో ఉంది.
సమంత ఖాతా నుండి వచ్చిన సినిమాకు ఫ్యాన్స్ ఎగబడి థియేటర్స్ కు వచ్చారు. అదే విధంగా, శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సింగిల్ సినిమా యూత్ లో హిట్ టాక్ అందుకుంది.
వీకెండ్లో ఈ సినిమాలు ఇంకా ఎంత వసూలు చేస్తాయో అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చగా మారింది. రెండు సినిమాలకీ ఇదే జోరు కొనసాగితే, వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు అందుకోవడం ఖాయం.