
సినిమా విడుదలకు ముందే టికెట్లు అమ్మడం అనేది సర్వసాధారణం. కానీ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఒడిస్సీ’ సినిమా మాత్రం ఓ రికార్డు సెట్ చేసింది. ఈ హాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ సినిమా 2026 జూలై 17న రిలీజ్ కానున్నా, ఇప్పటికే ఐమాక్స్ 70MM స్క్రీన్లలో అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించారు.
ప్రముఖ ఐమాక్స్ సంస్థ సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేసింది. అమెరికా, యూకే, కెనడాలో బుకింగ్స్ ప్రారంభించగా, భారతదేశంలో ఇంకా టైం ఉంది. అయినా, ఓవర్సీస్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ వేరే స్థాయిలో ఉంది.
ఇది నోలన్ గత చిత్రం ‘ది డార్క్ నైట్ రైజెస్’తో పోలిస్తే రెండు రెట్లు ముందుగానే బుకింగ్ స్టార్ట్ కావడం విశేషం. ఆ సినిమాకు ఆరు నెలల ముందే టికెట్లు ఓపెన్ చేశారు. కానీ ఒడిస్సీ కోసం ఏడాది ముందే టికెట్లు అందుబాటులోకి తీసుకురావడం కొత్త చరిత్రే.
ఈ మూవీ గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపొందుతోంది. టామ్ హోలాండ్, మ్యాట్ డేమన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీగా 250 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందిస్తున్నారు.
ఐమాక్స్ 70MM టికెట్లు రిలీజ్‌కు ముందే సోల్డ్ ఔట్ కావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.