
తెలుగు ప్రేక్షకులకు రేపు శుక్రవారం ఓటీటీలో డబుల్ ట్రీట్ సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన ‘కుబేర’, ‘భైరవం’ సినిమాలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారాల్లోకి వస్తున్నాయి. వీటితో పాటు ప్రేక్షకుల అంచనాలు కూడా ఓ లెవెల్లో ఉన్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర‘లో నాగార్జున సీబీఐ అధికారిగా, ధనుష్ బిచ్చగాడిగా నటించారు. రష్మిక నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. విలన్ పాత్రలో జిమ్ సర్బ్ కనిపించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అదే రోజున ‘భైరవం’ కూడా ఓటీటీలోకి వస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలతో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు.
అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లైలు కథను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. మే 30న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా రేపటి నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల ముందేమేరకు నిలబడతాయో చూడాలి!