
పహల్గాం: ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ హషీమ్ మూసా పని ముగిసింది. మహాదేవ్ పర్వత పరిసరాల్లో అతడి ఉనికిని గుర్తించిన భద్రతాదళాలు, ఆదివారం అర్ధరాత్రి నుంచి మిషన్ ప్రారంభించాయి. శ్రీనగర్‌కు సమీపంలోని 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందింది.
అర్ధరాత్రి చైనా తయారీ ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ కార్యకలాపాలను దళాలు గుర్తించాయి. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్రీయ రైఫిల్స్, పారా కమాండోలు తక్షణమే సన్నద్ధమయ్యారు. ఉదయం 8 గంటలకు డ్రోన్ సహాయంతో ముష్కరుల స్థావరాన్ని గుర్తించారు.
9.30కి కమాండోలు అడవుల్లోకి వెళ్లగా, 10 గంటలకు ఉగ్రవాదుల కదలికలు కనిపించాయి. సుమారు 11 గంటలకు తక్కువ సమయానికే ముట్టడిని ముగించారు. తొలి కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోగా, ఇంకొకరు పారిపోతూ కాల్పులకు గురయ్యాడు.
12.45కి మృతదేహాలను గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్ ప్రదేశంలో అమెరికా ఎం-4, ఏకే-47 రైఫిల్స్, రైఫిల్ గ్రనేడ్లు, భారీగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో హషీమ్ మూసా ఉన్నట్లు ధృవీకరించారు.
