
న్యూస్ డెస్క్: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా టెక్నాలజీ అభివృద్ధి విషయంలో ఎంత ముందుంటారో, సోషల్ మీడియాలో కూడా అంతే చురుకుగా ఉంటారు. అయితే ఆయన తెలుగులో చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.
మహీంద్రా నుంచి వచ్చిన తాజా ట్రక్ ఫ్యూరియో-8 ప్రమోషన్‌లో భాగంగా ఓ తెలుగు యాడ్ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. “ఒక్క నిర్ణయం చాలు… మీ విధి మీ చేతుల్లో ఉంది… ట్రక్ మార్చండి… మీ విధిని వశం చేసుకోండి” అంటూ తెలుగులో చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంది.
ఫ్యూరియో-8 ట్రక్ యొక్క ప్రత్యేకతలు చూస్తే… ఎక్కువ మైలేజ్‌తో లాభాలు పెరిగేలా రూపొందించారు. తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ ప్రయాణం చేయగల సామర్థ్యం కలదు.
అంతేకాదు, ఎక్కువ పేలోడ్ సామర్థ్యం ఉండటంతో వ్యాపార అవసరాల కోసం ఇది ఆదర్శవంతమైన ట్రక్‌గా నిలుస్తోంది. అలాగే తక్కువ నిర్వహణ ఖర్చుతో దీని పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
ఇమాక్స్ టెలిమాటిక్స్ సదుపాయంతో వేగవంతమైన సేవలు అందించేందుకు ట్రక్ పూర్తిగా సజ్జమైంది. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్రక్కింగ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.