Wednesday, March 4, 2026
HomeInternationalఉగ్రసంస్థపై అమెరికా కఠిన నిర్ణయం.. పాక్ కామెంట్

ఉగ్రసంస్థపై అమెరికా కఠిన నిర్ణయం.. పాక్ కామెంట్

america-declares-trf-terror-group-pakistan-response

న్యూస్ డెస్క్: అమెరికా ఇటీవల ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌)ను అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే. లష్కరే తోయిబా అనుబంధంగా పనిచేసే ఈ సంస్థ పహల్గామ్‌ ఉగ్రదాడిలో భాగస్వామ్యమైందని విచారణల్లో వెల్లడైంది. అమెరికా నిర్ణయంపై పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ తాజా ప్రకటన చేశారు.

వాషింగ్టన్‌ డీసీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించే అధికారం అమెరికాకు ఉంది. మాకు ఈ నిర్ణయంపై ఎలాంటి అభ్యంతరం లేదు. వారి ప్రమేయానికి ఆధారాలుంటే చర్యలు తీసుకోవచ్చు” అని వెల్లడించారు. అయితే, టీఆర్‌ఎఫ్‌, లష్కరే తోయిబాను ముడిపెట్టడం మాత్రం సరికాదని, తాము ఆ సంస్థను గతంలోనే నిర్మూలించామని స్పష్టం చేశారు.

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో గత ఏప్రిల్‌లో జరిగిన దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు టీఆర్‌ఎఫ్‌ బాధ్యతను స్వీకరించింది.

ఆపై అమెరికా టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించగా, భారత్ ఇప్పటికే 2023 జనవరిలో ఇదే ప్రకటన చేసింది. పాక్ ప్రభుత్వం మాత్రం అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవడం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఈ అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎఫ్‌పై తదుపరి చర్యలు ఏమివచ్చే అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular