
న్యూస్ డెస్క్: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై త్వరిత నిర్ణయం తీసుకోవద్దని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తుది నివేదిక వచ్చేవరకు నిర్దిష్ట వ్యాఖ్యలు చేయకూడదన్నారు.
ఏఏఐబీ సమర్పించిన 15 పేజీల ప్రాథమిక నివేదికపై ఆయన స్పందించారు. పైలట్లు, సిబ్బంది అతి ప్రతిభావంతులని, వారి మీద నమ్మకం ఉంచాలని చెప్పారు.
విమానయాన రంగానికి వారు వెన్నెముకలాంటివని, వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనేక సాంకేతిక అంశాల కారణంగా నివేదికపై ఇప్పుడే అభిప్రాయం ఇవ్వడం తగదు అన్నారు.
నివేదిక ప్రకారం, టేకాఫ్ తర్వాత కొన్ని సెకన్లలోనే ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆగిపోయాయి. దీనిపై పైలట్ల మధ్య సంభాషణ చివరిదిగా నమోదైంది.
మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఎటీసీ నుంచి స్పందన వచ్చినా, పైలట్ల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై పూర్తి విచారణ అనంతరం స్పష్టమైన అవగాహన వచ్చే వరకు ఆగాలని మంత్రి సూచించారు.