
న్యూస్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు రాజకీయంగా మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె కుమార్తె సైమా వాజెద్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సెలవుపై పంపించింది.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న డబ్ల్యుహెచ్‌వో ఆగ్నేయాసియా కార్యాలయంలో సైమా వాజెద్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె స్థానంలో తాత్కాలికంగా డాక్టర్ కేథరీనా బోహ్మే బాధ్యతలు స్వీకరించారు.
మీడియా ప్రశ్నలకు స్పందించిన డబ్ల్యుహెచ్‌వో అధికారులు… సైమా సెలవులో ఉన్నారని మాత్రమే వ్యాఖ్యానించారు. కానీ ఇది బంగ్లాదేశ్‌లో పెరిగిన ఆరోపణల నేపథ్యంలో జరిగిందని తెలుస్తోంది.
అవినీతి నిరోధక కమిషన్ ఆమెపై అధికార దుర్వినియోగం, మోసం, ఫోర్జరీ కేసులు నమోదు చేసింది. ఈ ఆరోపణలతో ఆమె స్థానం డబ్ల్యుహెచ్‌వోలో సస్పెన్స్‌లో పడింది.
ఇక షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు బంగ్లాదేశ్ అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ సమయంలో ఆమె కుమార్తెపై చర్యలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధి స్వాగతించారు. ఇది పరిపాలనా పారదర్శకతకు ఉదాహరణ అని పేర్కొన్నారు.