fbpx
Sunday, June 8, 2025
HomeMovie Newsకీరవాణి ఎలివేషన్ సాంగ్‌తో వీరమల్లు మెగా సర్ప్రైజ్!

కీరవాణి ఎలివేషన్ సాంగ్‌తో వీరమల్లు మెగా సర్ప్రైజ్!

veera-mallu-keervani-surprise-song-pawan-kalyan

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు ఇక విడుదలకు సిద్ధమవుతోంది. క్రిష్ ప్రారంభించిన ఈ సినిమా, ఇప్పుడు జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో జూన్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై మళ్లీ హైప్ పెంచే విధంగా సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ మాస్ ఎలివేషన్ సాంగ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. “ప్రళయకాల రుద్రుడల్లే…” అంటూ సాగే ఈ పాటను స్వయంగా కీరవాణి పాడటం విశేషం. రాంబాబు గోసాల రాసిన జోష్ ఫుల్ లిరిక్స్, పవన్ కళ్యాణ్ పాత్రను గంభీరంగా ఎలివేట్ చేయనున్నాయని సమాచారం. 

కీరవాణి స్వరం, బ్యాక్ స్కోర్ ఈ పాటకు అదనపు బలం కానుంది. ఈ పాటను ట్రైలర్‌తో కలిపి రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటిదాకా విడుదలైన గ్లింప్స్‌లు అంచనాలు పెంచగా, ఈ సాంగ్ విడుదలతో సినిమా హైప్ మరింతగా పెరగనుంది. నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ రైట్స్ తీసుకోవడం ఈ సినిమాపై మార్కెట్ డిమాండ్‌ని సూచిస్తోంది.

ఈ సినిమాను 17వ శతాబ్దంలో మొఘల్ పాలన నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. పవన్ ఓ యోధుడిగా, బాబీ సింహా, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ కెరీర్‌లో ఇది విజువల్స్, సాంకేతికంగా భారీ స్థాయిలో ఉండే సినిమా కానుందని టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular