ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించబోయే సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా ‘ఐకాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
సన్ పిక్చర్స్ నిర్మించే ఈ చిత్రం దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందనుంది. అయితే బన్నీ టీం టార్గెట్ మాత్రం స్ట్రెయిట్‌గా రూ.2000 కోట్లే. ఆ టార్గెట్ అందుకోవాలంటే బాలీవుడ్, ఓవర్సీస్ మార్కెట్లలో హైప్ అవసరం.
పుష్పతో హిందీ మార్కెట్‌లో బన్నీకి ఓ క్రేజ్ ఏర్పడింది. కానీ ఇప్పుడు జపాన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో కూడా బ్రాండ్ బన్నీకి ప్రాచుర్యం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రమోషన్ల కోసం రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు టాక్. ఇది పుష్ప రేంజ్‌కి మించి ఉండేలా చూసే దిశగా ప్లాన్ చేస్తున్నారు.
ఈసారైనా ఇండియన్ సినిమా వేదికపై రూ.2000 కోట్లు రాబట్టే తొలి తెలుగు హీరోగా బన్నీ నిలవాలనే భారీ మిషన్ ప్రారంభమైంది.