Sunday, July 12, 2026
HomeAndhra Pradeshఆ 'నాలుగు' స్థానాలు.. వైసీపీ వదిలేసుకోవడమేనా?

ఆ ‘నాలుగు’ స్థానాలు.. వైసీపీ వదిలేసుకోవడమేనా?

ycp-losing-grip-on-key-four-assembly-constituencies-tdp-dominance

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీకి కొన్ని జిల్లాల్లో మెజారిటీ దక్కడం ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా కీలక నియోజకవర్గాల్లో పార్టీ జెండా మోసే నాయకుడు వాయిస్ వినిపించే నేత కరువయ్యారు.

1. పాలకొల్లు (పశ్చిమ గోదావరి):నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా మంత్రి నిమ్మల రామానాయుడు విజయం సాధించారు. ఆయన సామాన్యులకు చేరువగా ఉండడం కలిసి వస్తోంది. వైసీపీ తరఫున బలమైన గళం వినిపించేవారు లేకుండా పోయారు.

2. టెక్కలి (శ్రీకాకుళం): టెక్కలిలోనూ వైసీపీ ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. టీడీపీ తరఫున మంత్రి అచ్చెన్నాయుడు వరుస విజయాలు అందుకుంటున్నారు.

3. మంగళగిరి (గుంటూరు): ఒకప్పుడు వెలుగు వెలిగిన వైసీపీ ఇప్పుడు మంగళగిరిలో అజాపజా లేకుండా పోయింది. గత ఎన్నికల ముందు జరిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వంటి నాటకీయ పరిణామాలు పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. మంత్రి నారా లోకేష్ 90 వేల ఓట్ల మెజారిటీ సాధించడం ఇక్కడ వైసీపీకి కేరాఫ్ లేకుండా చేసింది.

4. ఉండి (పశ్చిమ గోదావరి): ఉండి నియోజకవర్గంలోనూ వైసీపీకి ఏ మాత్రం పట్టు చిక్కడం లేదు. 2014, 2019, 2024 వరుసగా మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఫైర్‌బ్రాండ్ లీడర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఘనవిజయం సాధించారు.

ఈ కీలక నియోజకవర్గాల్లో అసలు వైసీపీ జెండా పట్టి ముందుండి నడిపించే నాథుడే లేని దుస్థితి ఏర్పడింది. వైసీపీ ఇకపై ఈ స్థానాలపై ఆశ వదులుకోవాల్సిందేనేమో అనే వాదన వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular