Sunday, May 24, 2026
HomeInternationalపుతిన్ భారత్ పర్యటనలో హైలెట్.. నడిచే దుర్గం 'ఆరస్ సెనట్' కారు!

పుతిన్ భారత్ పర్యటనలో హైలెట్.. నడిచే దుర్గం ‘ఆరస్ సెనట్’ కారు!

vladimir-putin-india-visit-auris-senat-luxury-car-security-features

రష్యా: అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పుతిన్‌కు కల్పించే భద్రత, ఆయన ప్రయాణించే వాహనంపై అందరి దృష్టి పడింది.

పుతిన్ ప్రయాణించే లగ్జరీ కారు ఆరస్ సెనట్ (Aurus Senat) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భద్రతతో కూడిన ఈ కారును నడిచే దుర్గంగా అభివర్ణిస్తారు.

శత్రు దుర్భేద్యంగా ఉండే ఈ కారు అవసరమైతే దాడికి ప్రతిదాడి చేయగల అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటుంది. ఈ బుల్లెట్ ఫ్రూఫ్ కారులో పేలుడు సంభవించినా దానికి ఏమీ కాదు. దీనిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు.

ఈ కారును 2018లో పుతిన్ కాన్వాయ్‌లో చేర్చారు. ఆరస్ మోటార్స్ అనే రష్యా సంస్థ తయారు చేసిన ఈ లిమోజిన్‌ను.. ప్రభుత్వ అవసరాల కోసం చేపట్టిన కోర్టెజ్ ప్రాజెక్టులో భాగంగా రూపొందించారు.

ఇది 4.4-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ8 ఇంజన్‌తో పాటు హైబ్రిడ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది దాదాపు 598 హార్స్‌పవర్, 880 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని సొగసైన ఎల్ఈడీ హెడ్ లైట్లు గంభీరమైన రూపాన్ని ఇస్తాయి.

ఆరస్ సెనట్ కారు మూడు వేరియంట్లలో వస్తుంది. ఈ కారును 2024లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు పుతిన్ బహుమతిగా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular