Friday, October 9, 2026
HomeMovie Newsవారసుడి రాకతో వరుణ్ - లావణ్యలకు శుభాకాంక్షల వెల్లువ

వారసుడి రాకతో వరుణ్ – లావణ్యలకు శుభాకాంక్షల వెల్లువ

varun-tej-lavanya-blessed-with-baby

మెగా కుటుంబంలో మళ్లీ ఆనందం నెలకొంది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి బిడ్డ పుట్టింది. ఈ సంతోషకరమైన వార్తతో అభిమానులు, సినీ వర్గాలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

2023 నవంబర్‌లో వీరి పెళ్లి జరిగింది. ఇక సెప్టెంబర్ 10న గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో లావణ్య త్రిపాఠి నార్మల్ డెలివరీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు.

సోషల్ మీడియాలో ఈ వార్త పాకిపోవడంతో వరుణ్ తేజ్ తండ్రయ్యాడనే హర్షం అభిమానుల్లో నెలకొంది. ఫోటోలు బయటకు వస్తే మరింత వైరల్ అవుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల జాబితాలో మరో వారసుడు చేరాడు.

ఇప్పటికే చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇప్పుడు వరుణ్ చిన్నారి పుట్టడంతో అభిమానులు మెగా వారసత్వం కొనసాగుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతానికి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీ చేస్తుండగా, లావణ్య త్రిపాఠి “టన్నెల్” అనే చిత్రంలో నటిస్తోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీకి మరో ఆనందం చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular