Sunday, July 19, 2026
HomeMovie News'వారణాసి'లో మహేష్ పంచావతారం.. జక్కన్నతో కష్టం ఖాయం!

‘వారణాసి’లో మహేష్ పంచావతారం.. జక్కన్నతో కష్టం ఖాయం!

టాలీవుడ్‌లో రాజమౌళితో సినిమా అంటే గ్లోబల్ ఇమేజ్ గ్యారెంటీ. అయితే అవుట్‌పుట్ కోసం నటీనటులను పిండేస్తారని, పర్ఫెక్షన్ కోసం చుక్కలు చూపిస్తారని జక్కన్నకు ఇండస్ట్రీలో ఒక పేరుంది. ఇప్పుడు ఆ వంతు సూపర్ స్టార్ మహేష్ బాబుకి వచ్చింది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు వారణాసి సినిమా కోసం తన కెరీర్‌లో ఎప్పుడూ పడనంత కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా 5 విభిన్న అవతారాల్లో కనిపించబోతున్నారట. రాముడు, రుద్ర పాత్రలతో పాటు మరో మూడు గెటప్స్ కూడా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్.

తన కెరీర్‌లో మహేష్ ఎప్పుడూ ద్విపాత్రాభినయం కూడా చేయలేదు. అలాంటిది 5 పాత్రలంటే మాటలు కాదు. ఒక్కో పాత్రకు ఒక్కో బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ చూపించాలి.

ఈ ఐదు గెటప్స్ కోసం మహేష్ ఫిజికల్‌గా చాలా మారాల్సి వస్తోంది. రుద్ర లుక్ కోసం జుట్టు పెంచి, కండలు పెంచి కొత్తగా తయారయ్యారు. రాముడి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.

దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌కు రాజమౌళి ఎక్కడా రాజీ పడటం లేదు. జక్కన్న చేతిలో పడ్డాక ఎంతటి స్టార్ హీరో అయినా కరగాల్సిందే కొత్తగా మెరవాల్సిందే. ఈ కష్టం రేపు స్క్రీన్ మీద అద్భుతంగా మారుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular