Thursday, June 18, 2026
HomeMovie Newsరెండేళ్ల బ్రేక్ తర్వాత.. విక్రమ్ కుమార్‌తో వైష్ణవ్ తేజ్?

రెండేళ్ల బ్రేక్ తర్వాత.. విక్రమ్ కుమార్‌తో వైష్ణవ్ తేజ్?

vaisshnav-tej-to-team-up-with-director-vikram-kumar

‘ఉప్పెన’తో రూ. 100 కోట్ల బ్లాక్‌బస్టర్‌తో అడుగుపెట్టిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ వంటి చిత్రాలు వరుసగా నిరాశపరచడంతో, ఈ యంగ్ హీరో తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టాడు.

సరైన కథ కోసం, గత రెండేళ్లుగా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ సుదీర్ఘ విరామంలో ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు చెప్పిన కథలను ఆయన తిరస్కరించినట్లు సమాచారం.

అయితే, ఈ గ్యాప్‌కు త్వరలోనే తెరపడేలా కనిపిస్తోంది. ‘మనం’, ’24’ వంటి క్లాసిక్స్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్‌తో వైష్ణవ్ చర్చలు జరుపుతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది.

విక్రమ్ కుమార్ చెప్పిన స్క్రిప్ట్‌కు వైష్ణవ్ తేజ్ సానుకూలంగా స్పందించారని, ప్రస్తుతం ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది.

ఆసక్తికరంగా, విక్రమ్ కుమార్ ఇదే సమయంలో విజయ్ దేవరకొండ కోసం కూడా మరో స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, వైష్ణవ్ తేజ్ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లేనని, 2026 ప్రథమార్థంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల విరామం తర్వాత వైష్ణవ్ ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular