
న్యూస్ డెస్క్: 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఐపీఎల్ రైజింగ్ స్టార్ ఆసియా కప్ టోర్నీల్లో సెంచరీలు సాధించిన వైభవ్, తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ లీగ్‌లోనూ సత్తా చాటాడు.
మంగళవారం మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో బిహార్‌కు చెందిన వైభవ్ కేవలం 61 బంతుల్లోనే 108 పరుగులు బాది అదరగొట్టాడు. ఇందులో 7 ఫోర్లు 7 సిక్స్‌లు ఉన్నాయి.
ఈ సెంచరీతో వైభవ్ అరుదైన ఘనత సాధించాడు. ఇవాల్టికి అతని వయసు 14 ఏళ్ల 250 రోజులు. దీంతో ముస్తాక్ అలీ లీగ్ చరిత్రలో శతకం నమోదు చేసిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
తొలుత హాఫ్ సెంచరీకి 34 బంతులు తీసుకున్న వైభవ్, ఆ తర్వాత 50 పరుగులను కేవలం 24 బంతుల్లోనే కంప్లీట్ చేశాడు. మొత్తం 58 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతనిపై మరోసారి ప్రశంసల వర్షం కురుస్తోంది.
