
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్.. ఈ కాంబినేషన్ వింటేనే ‘గబ్బర్ సింగ్‘ సృష్టించిన ప్రభంజనం గుర్తొస్తుంది. 13 ఏళ్ల క్రితం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆ చిత్రం, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూపంలో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. అయితే, కాలం మారింది, ప్రేక్షకుల అభిరుచి మారింది. మరి ఆ పాత మ్యాజిక్‌నే నమ్ముకుంటే ఈసారి వర్కవుట్ అవుతుందా?
‘గబ్బర్ సింగ్’ విజయం వెనుక పవన్ కళ్యాణ్ ఇమేజ్, హరీష్ మార్క్ డైలాగులు, కామెడీ టైమింగ్ కీలక పాత్ర పోషించాయి. అప్పటి ట్రెండ్‌కు, ఆడియన్స్ పల్స్‌కు అది పర్ఫెక్ట్‌గా సింక్ అయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. రొటీన్ కథలను, కేవలం హీరో ఇమేజ్‌ను నమ్ముకున్న సినిమాలను ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు.
కంటెంట్‌లో కొత్తదనం, కథనంలో ఫ్రెష్‌నెస్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా నిలబడటం కష్టం. ఇలాంటి సమయంలో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ‘గబ్బర్ సింగ్’ తరహాలోనే ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే ఫార్ములాను రిపీట్ చేస్తే, అది బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు.
ఈ ప్రాజెక్ట్‌పై ఒత్తిడి పెరగడానికి మరో కారణం దర్శకుడు హరీష్ శంకర్ ట్రాక్ రికార్డ్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఆయన నుంచి ఆ స్థాయి బ్లాక్‌బస్టర్ రాలేదు. ‘డీజే’, ‘గద్దలకొండ గణేష్’ యావరేజ్‌గా నిలిస్తే, ‘మిస్టర్ బచ్చన్’ వంటివి నిరాశపరిచాయి. అయినా, పవన్ కళ్యాణ్ ఆయనపై పూర్తి నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు.
ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత హరీష్‌పై ఉంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను వాడుకుంటూనే, నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఓ ఫ్రెష్ కథను చెప్పాలి. కేవలం ఎలివేషన్లు, పాత పంచ్‌లపై ఆధారపడితే కష్టమే.
2026లో విడుదల కానున్న ఈ చిత్రం, హరీష్ శంకర్‌కు అసలు సిసలు అగ్నిపరీక్ష. ‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్‌ను నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా రీక్రియేట్ చేయడంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
