Tuesday, December 16, 2025
HomeAndhra Pradeshలడ్డూ కేసులో ధర్మారెడ్డి 'అప్రూవర్'? టీడీపీ మైండ్ గేమా!

లడ్డూ కేసులో ధర్మారెడ్డి ‘అప్రూవర్’? టీడీపీ మైండ్ గేమా!

ttd-laddu-case-dharma-reddy-approver-rumors-tdp-mind-game/

తిరుమల: లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం కేసు విచారణ వేగవంతమైంది. సిట్ అధికారులు ఈ కేసులో టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డిని రెండు రోజులుగా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. అయితే, ఈ విచారణపై టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.

మంగళవారం 8 గంటల పాటు సాగిన విచారణలో, “కల్తీ నెయ్యి వస్తుందని తెలిసినా ఎందుకు ఆపలేదన్న” ప్రశ్నకు, ధర్మారెడ్డి “హైకమాండ్ ఒత్తిడి ఉంది” అని సమాధానం చెప్పినట్లు టీడీపీ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి.

ఈ వార్తలపై వైసీపీలో చర్చ జరుగుతుండగానే, బుధవారం మరో సంచలన ప్రచారం మొదలైంది. ధర్మారెడ్డి ఈ కేసులో ‘అప్రూవర్’గా మారిపోయారంటూ టీడీపీ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది.

ధర్మారెడ్డి ఇంకా సిట్ విచారణలోనే ఉండగా ఈ ప్రచారం ఊపందుకోవడంపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇది కేవలం టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్‌లో భాగమేనని అంటోంది.

ధర్మారెడ్డి విచారణ తర్వాత, సిట్ అధికారులు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలోనే, సుబ్బారెడ్డిపై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ సోషల్ మీడియా వ్యూహాత్మకంగా ‘అప్రూవర్’ ప్రచారాన్ని తెరపైకి తెచ్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular