Friday, December 12, 2025
HomeInternationalట్రంప్ ఎత్తుగడ.. అమెరికన్లకు $2000 'టారిఫ్ డివిడెండ్'!

ట్రంప్ ఎత్తుగడ.. అమెరికన్లకు $2000 ‘టారిఫ్ డివిడెండ్’!

trump-proposes-2000-tariff-dividend-amid-protests

అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రజాకర్షక పథకానికి తెరలేపారు. దేశంలో మధ్యతరగతి, పేద అమెరికన్లకు “టారిఫ్ డివిడెండ్” కింద ఒక్కొక్కరికీ $2000 (సుమారు రూ. 1.6 లక్షలు) అందిస్తామని ప్రకటించారు.

అయితే, ఈ ప్రకటన వెనుక బలమైన రాజకీయ కారణం కనిపిస్తోంది. ఇటీవల ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఈ చారిత్రక నిరసనల సెగ తగలడంతోనే, వారి కోపాన్ని చల్లార్చేందుకు ట్రంప్ ఈ ‘డాలర్ల వల’ వేశారని విశ్లేషకులు అంటున్నారు.

ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేదానిపై ట్రంప్ స్పష్టత ఇచ్చారు. విదేశీ దిగుమతులపై విధిస్తున్న భారీ టారిఫ్‌ల (పన్నులు) ద్వారా ప్రభుత్వానికి ట్రిలియన్ల డాలర్ల ఆదాయం వస్తోందని, అందులో నుంచే ఈ డబ్బు పంచుతామని తెలిపారు.

ఈ టారిఫ్ ఆదాయంతోనే $37 ట్రిలియన్ల జాతీయ అప్పును కూడా తీరుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన టారిఫ్ విధానాలను విమర్శించే వారిని “ఫూల్స్” (మూర్ఖులు) అని ట్రంప్ కొట్టిపారేశారు.

అయితే, ట్రంప్ విధించిన ఈ అసాధారణ టారిఫ్‌లు గ్లోబల్ వాణిజ్యానికి విఘాతం కలిగిస్తున్నాయంటూ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది.

ఈ $2000 హామీ, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించి, రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకేనని నిపుణులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular