
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీని “కిల్లర్ లాంటి వాడు”, “చాలా గట్టి మనిషి” అంటూ ప్రశంసించడం, అదే సమయంలో భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందంపై సంకేతాలివ్వడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ట్రంప్ వైఖరి భారత్ విషయంలో ఎప్పుడూ కాస్త గందరగోళంగానే ఉంటుంది. ఒకవైపు కఠినమైన వాణిజ్య సుంకాలు విధిస్తూ ఒత్తిడి తెస్తారు, మరోవైపు మోదీతో తనకు అద్భుతమైన వ్యక్తిగత సంబంధాలున్నాయని, ఆయనంటే గౌరవమని చెబుతుంటారు. తాజా వ్యాఖ్యలు కూడా ఇదే వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ, “నేను భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం చేయబోతున్నాను. ప్రధాని మోదీపై నాకు చాలా గౌరవం, ప్రేమ ఉంది” అని ప్రకటించారు. దీంతో, భారత్‌పై విధించిన సుంకాలను అమెరికా తగ్గించవచ్చనే ఊహాగానాలకు బలం చేకూరింది.
ఈ సందర్భంగా మోదీ వ్యక్తిత్వాన్ని ట్రంప్ ప్రత్యేకంగా అభినందించారు. “ఆయన చాలా ఆకర్షణీయమైన వ్యక్తి. కిల్లర్ లాంటి వాడు, చాలా గట్టి మనిషి” అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల సమయంలో మోదీ దృఢ వైఖరిని ప్రస్తావిస్తూ, “‘లేదు, మేము పోరాడతాం’ అని ఆయన చెప్పాడు” అని గుర్తు చేసుకున్నారు.
ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా-భారత్ సంబంధాలలో కొత్త అధ్యాయానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తగ్గి, ద్వైపాక్షిక బంధం మళ్లీ బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మోదీ నాయకత్వంపై ట్రంప్‌కు ఉన్న ఈ గౌరవం, కొత్త వాణిజ్య ఒప్పందాలకు, మెరుగైన దౌత్య సంబంధాలకు బాటలు వేస్తుందని ఆశిస్తున్నారు.
