Sunday, January 18, 2026
HomeSportsట్రంప్ ఆరోగ్యం.. జేడీ వాన్స్ వ్యాఖ్యలతో కొత్త ఊహాగానాలు

ట్రంప్ ఆరోగ్యం.. జేడీ వాన్స్ వ్యాఖ్యలతో కొత్త ఊహాగానాలు

trump-health-focus-jd-vance-comments

న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఆరోగ్యం చుట్టూ అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్న వేళ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారితీశాయి. “అధ్యక్ష బాధ్యతలు ఎప్పుడైనా వస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను” అని వాన్స్ స్పష్టం చేయడంతో ట్రంప్ సీటుపై అడ్వాన్స్ ఫోకస్ మొదలైందన్న టాక్ వెలువడుతోంది.

వాన్స్ యూఎస్ టుడే ఇంటర్వ్యూలో ట్రంప్ ఆరోగ్యాన్ని బలంగా సమర్థించారు. “అధ్యక్షుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఉదయం తొలుత లేస్తారు, రాత్రి ఆలస్యంగా పడుకుంటారు. కానీ జీవితంలో ఎప్పుడూ అంచనా వేయలేని పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు నేను సిద్ధంగా ఉంటాను” అని వ్యాఖ్యానించారు.

ఇటీవల వైట్‌హౌస్ ట్రంప్‌కి దీర్ఘకాల సిరల వ్యాధి ఉందని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం సాధారణమని వైట్‌హౌస్ చెప్పినా, ఊహాగానాలు ఆగడం లేదు. ట్రంప్ స్వయంగా వాన్స్‌ను “మాగా ఉద్యమానికి వారసుడు” అని పేర్కొనడం కూడా ఆసక్తికరంగా మారింది.

అమెరికా 2028 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా వాన్స్ పేరు వినిపించే అవకాశాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ట్రంప్ పదవీకాలం మధ్యలో ఆరోగ్య కారణాలతో విరమిస్తే, వాన్స్ నేరుగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

మొత్తానికి, జేడీ వాన్స్ వ్యాఖ్యలు ట్రంప్ ఆరోగ్యం, రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తు, రాబోయే ఎన్నికల దిశలో కొత్త ఊహాగానాలకు దారితీశాయి. అమెరికా రాజకీయాల్లో మాగాకు వారసుడిగా వాన్స్ పేరు మరింతగా వినిపించేలా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular