
‘KGF’ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్‘ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై పాజిటివ్ బజ్ కన్నా, వాయిదా పడుతుందనే రూమర్లే ఎక్కువగా చక్కర్లు కొట్టాయి. యష్ ఏకకాలంలో ‘రామాయణ’ షూటింగ్‌లో పాల్గొంటుండటంతో ‘టాక్సిక్’ ఆలస్యమవుతుందని ప్రచారం జరిగింది.
ఈ వదంతులన్నింటికీ చెక్ పెడుతూ, మేకర్స్ తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సినిమా విడుదల తేదీలో ఎటువంటి మార్పు లేదని అధికారికంగా ప్రకటించారు. ముందుగా అనౌన్స్ చేసినట్లే, 2026 మార్చి 19న ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ రిలీజ్ డేట్ వెనుక పక్కా స్ట్రాటజీ ఉంది. మార్చి 19కి ఆ వారం మొత్తం పండుగ సెలవులు కలిసి వస్తున్నాయి. ఉగాది, గుడి పడ్వా, ఈద్ వంటి పండుగలు ఒకేసారి రావడంతో, ఇది పాన్ ఇండియా కలెక్షన్లకు గోల్డెన్ వీక్‌గా మారనుంది.
ఈ లాంగ్ వీకెండ్ కారణంగా, సినిమాకు టాక్ ఎలా ఉన్నా, ఓపెనింగ్స్ మాత్రం రికార్డు స్థాయిలో ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మేకర్స్ కూడా పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలిపారు. వీఎఫ్‌ఎక్స్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, 2026 జనవరి నుంచి ప్రమోషన్లు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
‘టాక్సిక్’ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. దీన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేయనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ సొంత బ్యానర్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం రిలీజ్‌కు 140 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో ఫ్యాన్స్‌లో అసలైన జోష్ మొదలైంది. ఈ పక్కా ప్లానింగ్‌తో ‘KGF’ రికార్డులను బ్రేక్ చేయడమే యష్ తదుపరి లక్ష్యంగా కనిపిస్తోంది.
