Sunday, October 4, 2026
HomeNationalవ్యక్తిత్వ పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించడం ఎందుకు?

వ్యక్తిత్వ పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించడం ఎందుకు?

tollywood-stars-approach-delhi-high-court-for-personality-rights

న్యూస్ డెస్క్: గత కొంతకాలంగా డీప్ ఫేక్ వీడియోలు, సెలబ్రిటీల ఫోటోల దుర్వినియోగం పెరిగిపోయింది. ప్రముఖులు, రాజకీయ నాయకులను కొంతమంది ఆకతాయిలు టార్గెట్ చేస్తూ, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీంతో చాలామంది సెలబ్రిటీలు ముందస్తుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.

టాలీవుడ్ నుంచి ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే బాట పట్టారు.

తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించకుండా చూడాలని, సోషల్ మీడియాలో ట్రోల్స్, అనవసర వ్యాఖ్యలు చేయకుండా తమ వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే తెలుగు హీరోలంతా తమ రాష్ట్రాల్లోని హైకోర్టులను కాకుండా ఢిల్లీ హైకోర్టునే ఎందుకు ఆశ్రయిస్తున్నారు అనే సందేహం చాలామందిలో ఉంది. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి.

కాపీరైట్, ఐటీ, పర్సనాలిటీ రైట్స్ వంటి జాతీయస్థాయి వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఢిల్లీ హైకోర్టు కేంద్రంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులు దేశం మొత్తం వర్తిస్తాయి. ఈ కారణాల వల్లే టాలీవుడ్, బాలీవుడ్ (ఐశ్వర్యారాయ్, అమితాబ్, సల్మాన్ ఖాన్ వంటి వారు) సెలబ్రిటీలు కూడా తమ గౌరవ మర్యాదలను కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular