
న్యూస్ డెస్క్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గత నెల 27న మొదలుపెట్టిన రిజిస్ట్రేషన్ డిసెంబర్ ఒకటో తేదీ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
మొత్తం 9.55 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24.05 లక్షల మంది భక్తులు తమ వివరాల్ని సమర్పించి లక్కీ డిప్ కోసం ఎదురు చూస్తున్నారు. లక్కీ డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాల్ని ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
లక్కీ డిప్‌లో ఎంపిక కాని వారికి, కొత్తగా దర్శనం చేసుకోవాలనుకునే వారికి మరో అవకాశం ఉంది.
మరో ఛాన్స్ వివరాలు:
ఈ నెల ఐదో తేదీన (డిసెంబర్ 5) ఆన్‌లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు సంబంధించిన టోకెన్ల వివరాలు:
- డిసెంబర్ 30న – 57 వేల టోకెన్లు
- డిసెంబర్ 31న – 64 వేల టోకెన్లు
- జనవరి 1న – 55 వేల టోకెన్లు
ఈ తేదీలకు మాత్రమే టోకెన్లు అందుబాటులో ఉండగా, మిగిలిన ఏడు రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తుల్ని నేరుగా అనుమతులు ఇస్తారు.
అదనంగా రూ.300 చొప్పున 15 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 5న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ యాప్ వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకునే వీలుంది.
