
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న విడుదలై డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు రాబడుతోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా తొలి మూడు రోజుల్లో (వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా రూ. 10 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. తొలిరోజు ప్రీమియర్లతో కలిపి ఇండియాలో రూ. 1.3 కోట్లు సాధించగా, శని, ఆదివారాల్లో వసూళ్లు పుంజుకున్నాయి.
అయితే, ఈ సినిమా అసలు పరీక్ష సోమవారం నుంచే మొదలైంది. సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, లాభాల్లోకి రావాలంటే రూ. 30 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉందని అంచనా.
సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు (శాటిలైట్, ఓటీటీ) ఇప్పటికే రూ. 24 కోట్లకు అమ్ముడై నిర్మాతలు సేఫ్ జోన్‌లోనే ఉన్నా, థియేట్రికల్‌గా ‘క్లీన్ హిట్’ అనిపించుకోవాలంటే ఈ వారం కూడా వసూళ్ల జోరు తగ్గకూడదు.
ఈ వీక్‌డేస్‌లో సినిమా ఎంతవరకు నిలబడుతుందనే దానిపైనే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ తుది ఫలితం ఆధారపడి ఉంది. సోమవారం నుంచి కలెక్షన్లు స్థిరంగా కొనసాగితేనే సినిమా సేఫ్ జోన్‌లోకి వస్తుంది.
