Friday, January 16, 2026
HomeMovie Newsతమన్ రెండో పాట: అభిమానులను మెప్పించకపోతే కష్టమేనా?

తమన్ రెండో పాట: అభిమానులను మెప్పించకపోతే కష్టమేనా?

thaman-raja-saab-second-single-pressure-to-impress-prabhas-fans-after-first-song-trolls

న్యూస్ డెస్క్: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన అదిరిపోయే పాటలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, ఆయనపై కాపీ రైట్స్ మరకలు కూడా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

మొదటి పాటపై విమర్శల దాడి:

‘ది రాజా సాబ్’ నుంచి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘రెబల్ సాబ్’కు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రభాస్ వింటేజ్ లుక్స్, ఎనర్జిటిక్ స్టెప్పులు కొందరికి నచ్చినా, చాలామంది ఆశించిన స్థాయిలో పాట లేదని, పాన్ ఇండియా స్టార్‌కు ఇలాంటి సాంగ్ ఇచ్చారంటూ తమన్ పై ఫైర్ అయ్యారు. అంతేకాకుండా, ఆ పాట ట్యూన్ ఇంగ్లీష్ మ్యూజిక్ వీడియో నుంచి కాపీ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి.

ప్రభాస్‌తో తమన్ మొదటిసారి పనిచేస్తుండటంతో అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు సినిమా నుంచి రెండో సాంగ్ విడుదల కానుంది.

రెండో పాటపై భారీ ఒత్తిడి:

తమన్ తాజాగా ‘రాజా సాబ్ డే’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ మళ్లీ స్పందిస్తున్నారు. ఈసారైనా సూపర్ బీట్ క్యాచీ ట్యూన్‌తో కూడిన మంచి సాంగ్ ఇవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

మొదటి సాంగ్‌కు వచ్చిన విమర్శలకు దీటుగా సెకండ్ సింగిల్ తో తమన్ కచ్చితంగా ప్రభాస్ అభిమానులను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఆ ప్రభావం సినిమాపై పడే అవకాశం ఉంది. రాజా సాబ్ రెండో పాటతో తమన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular