
న్యూస్ డెస్క్: ఓజీ టికెట్ రేట్లపై కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో సినిమా టికెట్ల ఇష్యూ మరింత హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ప్రొడ్యూసర్లలో టెన్షన్ క్రియేట్ చేశాయి.
ఇకపై రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్ షోలు, స్పెషల్ ప్రీమియర్లు, టికెట్ రేట్ల పెంపులు ఉండవు అని మంత్రి స్పష్టం చేశారు. గతంలో పుష్ప 2 సందర్భంలో కూడా ఇదే తన మాట అని గుర్తు చేశారు. సినిమాను సామాన్య ప్రేక్షకులందరికీ అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ధోరణి అని చెప్పారు.
దీంతో రాబోయే నెలల్లో విడుదలకు రెడీగా ఉన్న ది రాజా సాబ్, అఖండ 2, విశ్వంభర, స్వయంభు, మన శంకరవరప్రసాద్ గారు లాంటి బిగ్ మూవీస్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది.
మల్టీప్లెక్సుల్లో గరిష్టంగా 295, సింగిల్ స్క్రీన్లలో 175 కంటే ఎక్కువ ఛార్జ్ చేయరని స్పష్టం చేశారు.
ప్రొడ్యూసర్లు టికెట్ రేట్ల హైకులు లేకపోతే భారీ బడ్జెట్ సినిమాలకు నష్టం అవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కామన్ ఆడియన్స్ కు ఇది శుభవార్తే అని చెబుతోంది.
ఇక హైకోర్టు కూడా ప్రభుత్వ వైఖరికి మద్దతు ఇచ్చే తీరు చూపింది. దీంతో తెలంగాణలో సినిమా బిజినెస్ రూల్స్ ఇప్పుడు పూర్తిగా మారబోతున్నాయి.
