
తమన్నా భాటియా, చిన్న హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగారు. అయితే గత కొన్నాళ్లుగా తమన్నా బాలీవుడ్‌లో బాగా బిజీ అయిపోయారు. బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఐతే ఇప్పుడు తమన్నా తన రూట్‌ను మార్చి ఓ బాలీవుడ్ బయోపిక్‌లో కీలక పాత్ర చేస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ వి. శాంతారామ్జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో తమన్నా.. శాంతారామ్ రెండో భార్య, ఒకప్పటి నటి అయిన జయశ్రీ గడ్కర్ పాత్రలో కనిపించనున్నారు.
రీసెంట్‌గా మేకర్స్ ఆ సినిమా నుంచి తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో తమన్నా వింటేజ్ సెటప్‌లో చీర కట్టులో ఎంతో అందంగా మెరిశారు. తమన్నా ఆ పోస్టర్‌లో ఒక వింటేజ్ నటి వైబ్‌ను తీసుకొచ్చారు.
కెరీర్‌లో ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేసిన తమన్నా, ఇప్పుడు సడెన్‌గా ఓ బయోపిక్‌లో కీలక పాత్రకు ఎంపికవడం విశేషం. అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
