Tuesday, October 6, 2026
HomeNationalవీధి కుక్కలు కనిపిస్తే తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు!

వీధి కుక్కలు కనిపిస్తే తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు!

supreme-court-orders-relocation-of-stray-dogs-from-public-places

దేశంలో వీధి కుక్కల దాడులు పెరుగుతుండటం, అదే సమయంలో జంతు ప్రేమికులు వాటిపై కరుణ చూపాలని కోరుతుండటంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రజా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ప్రజలు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రుల వద్ద వీధి కుక్కలు ఉండకూడదని స్పష్టం చేసింది. అలాగే, పాఠశాలలు, క్రీడా ప్రాంగణాల వద్ద కూడా కుక్కలు కనిపించకుండా చూడాలని ఆదేశించింది.

ఈ ప్రాంతాల్లో కుక్కలు కనిపిస్తే, వాటిని తక్షణమే పట్టుకుని షెల్టర్ హోంలకు తరలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అవసరమైతే, విద్యార్థుల రక్షణ కోసం పాఠశాలల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని సూచించింది.

కుక్కలను పట్టుకోవడమే కాకుండా, వాటిని సురక్షితంగా షెల్టర్లకు తరలించడం కూడా అధికారుల బాధ్యత అని నొక్కి చెప్పింది. పబ్లిక్ ప్రదేశాల్లో కుక్కలు లేకుండా చూసేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆదేశించింది.

గతంలో ఢిల్లీలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చినప్పుడు జంతు ప్రేమికులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఈ తీర్పు దేశవ్యాప్తంగా వర్తిస్తుండటంతో, వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular