
రాజమౌళి సినిమా అంటే అది ఒక ఫ్యామిలీ ప్యాకేజ్. ఆయన కుటుంబ సభ్యులంతా ఏదో ఒక విభాగంలో పనిచేస్తూ సినిమాకు వెన్నెముకగా నిలుస్తారు. ఈ ఆనవాయితీ SSMB29 ‘వారణాసి’తో కూడా కొనసాగుతోంది. అయితే, ఈసారి జక్కన్న తన టీమ్‌లోకి ఓ ఊహించని పేరును చేర్చారు. ఆయనే ‘అమృతం’ సీరియల్‌తో తెలుగువారికి దగ్గరైన కాంచి.
కీరవాణి సోదరుడైన కాంచి, కేవలం నటుడిగానే కాదు, రచయితగా, దర్శకుడిగా కూడా ఇండస్ట్రీకి సుపరిచితుడే. గతంలో జక్కన్న ‘మర్యాద రామన్న’కు ఆయన కథా సహకారం అందించారు.
తాజాగా విడుదలైన ‘వారణాసి’ గ్లింప్స్‌లో, కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్‌తో పాటు కాంచి పేరును కూడా వేశారు. ఇతిహాసాలపై మంచి పట్టున్న కాంచి, ఈ టైమ్ ట్రావెల్, మైథాలజీ సబ్జెక్ట్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయం వెనుక రాజమౌళి ప్లాన్ వేరే ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ‘వారణాసి’ లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌కు రైటర్‌గా పనిచేస్తే, కాంచి కెరీర్‌కు అది పెద్ద బ్రేక్ ఇస్తుంది.
ఒక విధంగా, రాజమౌళి తన సోదరుడి కెరీర్‌ను ఈ సినిమా ద్వారా మరో మెట్టు ఎక్కిస్తున్నారని చెప్పవచ్చు. ‘వారణాసి’ గ్లింప్స్ చూశాక, ఈ సినిమా హిట్టయితే కాంచి బిజీ రైటర్‌గా మారడం ఖాయం.
