
అంచనాలకు అతీతంగా, SSMB29 టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన భారీ ఈవెంట్‌లో, రాజమౌళి తన గ్లోబల్ ప్రాజెక్ట్‌కు “వారణాసి” అని పేరు పెట్టినట్లు రివీల్ చేశారు. ఈ ట్రైలర్ చూశాక ఇది మామూలు సినిమా కాదని, ఓ విజువల్ వండర్ అని ఫిక్స్ అయిపోయారు.
GlobeTrotter, #TimeTrotter అనే హ్యాష్‌ట్యాగ్‌లకు తగ్గట్టే, ఈ గ్లింప్స్ ప్రపంచాన్ని, కాలాలను చుట్టేసింది. 512 CE నాటి వారణాసిని, 2027 CEలో భూమిని ఢీకొట్టే “శాంభవి” అనే గ్రహశకలాన్ని, అంటార్కిటికా మంచు పర్వతాలను, ఆఫ్రికన్ అడవులను చూపించారు.
అన్నింటికంటే పెద్ద షాక్, 7200 BCE నాటి త్రేతాయుగం, లంకా నగరం, హనుమంతుడిని పోలిన ఓ భారీ ఆకారాన్ని చూపించడం. ఇది మైథాలజీని, సైన్స్ ఫిక్షన్‌ను, అడ్వెంచర్‌ను కలిపి జక్కన్న తీస్తున్న అద్భుతంగా అనిపిస్తోంది.
ఈ విజువల్ వండర్ మధ్యలో, సూపర్ స్టార్ మహేష్ బాబును సరికొత్తగా ఆవిష్కరించారు. పొడవాటి జుట్టు, గాయాలతో రగ్డ్ లుక్‌లో, చేతిలో త్రిశూలం పట్టి, నందిపై స్వారీ చేస్తూ మహేష్ కనిపించిన తీరు గూస్‌బంప్స్ తెప్పించింది.
ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ తారాగణం, కీరవాణి సంగీతం, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమా స్థాయిని పెంచేశాయి. ఈ గ్లింప్స్‌తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటాయి.
