
ఎస్ఎస్ఎంబీ29లో రాజమౌళి ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారనే కొత్త ప్రచారం ఫ్యాన్స్‌లో చర్చకు దారితీసింది. ఆ పాటలో హీరోయిన్‌గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న రాజమౌళి, స్పెషల్ సాంగ్ కోసం కూడా హాలీవుడ్ భామను ఎందుకు తీసుకోలేకపోయారు? గ్లోబల్ హైప్పెంచడానికి ఈ లాజిక్‌ను ఎందుకు మిస్ అయ్యారు అని కొంతమంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
రాజమౌళి తన సినిమాల్లో వీలైనప్పుడల్లా స్పెషల్ సాంగ్స్‌ను పెడుతూనే వస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లో స్పెషల్ సాంగ్స్‌కు ఎంత డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం.
అయితే, ప్రభాస్‌తో చేసిన సాహో సినిమాలో కూడా జాక్వెలిన్ చిందులేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు మహేష్‌తో మరో ఛాన్స్ దక్కిందనే వార్తలు వస్తున్నాయి.
రాజమౌళి, మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమాలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది.
దీనిపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా రంగంలోకి దించుతున్నారు.
