
మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి సినిమా రీసెంట్‌గా విడుదలైన గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. సినిమా గ్లింప్స్ కోసమే రాజమౌళి ఫ్యాన్స్‌కు పాస్‌పోర్ట్‌లు ఇచ్చి హంగామా చేశారు.
జక్కన్న తన సినిమా ప్రమోషన్ కోసం జేమ్స్ కామెరూన్ అవతార్ 3 సిరీస్‌ను వాడుకోవాలని చూస్తున్నారట. అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ ఈ నెల 19న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా ప్రదర్శనలో వారణాసి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. జేమ్స్ కామెరూన్ సినిమాతో పాటు రాజమౌళి వారణాసికి వరల్డ్ వైడ్ గా పబ్లిసిటీ దక్కుతుంది.
అవతార్ 3 ప్రదర్శించే ప్రతి స్క్రీన్ లో వారణాసి గ్లింప్స్ వేస్తారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా టీజర్ కే ఇంత భారీ ప్లానింగ్ ఉందంటే, సినిమాకు రాజమౌళి ఎలాంటి ప్లాన్స్ వేస్తాడన్నది ఊహించడానికే క్రేజీగా ఉంది.
వారణాసి సినిమాలో మహేష్ రుద్ర పాత్రలో కనిపిస్తున్నాడు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్‌తో ఈ సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయాలని చూస్తున్నారు.
