Sunday, July 12, 2026
HomeMovie News'వారణాసి' కోసం మాస్టర్ ప్లాన్.. జనవరి వరకు బ్లాక్!

‘వారణాసి’ కోసం మాస్టర్ ప్లాన్.. జనవరి వరకు బ్లాక్!

ss-rajamouli-varanasi-shooting-speed-hyderabad-studio-block

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. వారణాసి టైటిల్ టీజర్ ఇచ్చిన కిక్ నుంచి ఫ్యాన్స్ ఇంకా బయటకు రాలేదు. సాధారణంగా స్లోగా తీసే జక్కన్న, ఈసారి షూటింగ్‌ను మాత్రం శరవేగంగా నడిపిస్తున్నారు.

ఆ జోరును కంటిన్యూ చేస్తూ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ స్టూడియోను రాజమౌళి తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ స్టూడియోలోని ఫ్లోర్లన్నింటినీ ఏకంగా వచ్చే ఏడాది జనవరి వరకు బ్లాక్ చేసేశారట.

అక్కడ చిన్నచిన్న పనులు కాదు. ఏకంగా సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ జరగబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. టీజీ విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ స్టూడియోలో జనవరి వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపేలా ప్లానింగ్ జరిగింది.

ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబుతో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొంటారు. గ్లోబల్ రేంజ్ కథకు తగ్గట్టుగానే భారీ సెట్టింగులు విజువల్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేస్తున్నారు.

జనవరి వరకు ఈ షూటింగ్ పూర్తయితే సినిమాలోని కీలక ఘట్టాలు ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకుని, సినిమాను 2027 సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular