
దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ (SSMB29) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జక్కన్న ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇటీవలే టైటిల్ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసి సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు.
సాధారణంగా రాజమౌళి సినిమాలు ఆలస్యమవుతాయి కానీ, ఈ సినిమా షూటింగ్‌ను ఆయన ఎంతో వేగంగా పూర్తి చేస్తున్నారట. అందుకే సినిమాను 2027 సమ్మర్‌కు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
వారణాసిలో మహేష్‌కు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించనుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో విలన్ గా నటించనున్నారు.
రాజమౌళి తన సినిమాల్లో కీలక పాత్రలకు స్టార్స్‌నే తీసుకుంటారనే విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి సీన్స్‌ను మేకర్స్ చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చైల్డ్‌హుడ్ సీన్స్ సినిమాలో కీలకంగా ఉండనున్నాయి.
ఈ ప్రతిష్టాత్మక సినిమాను కె.ఎల్ నారాయణ ఎస్.ఎస్ కార్తికేయ నిర్మిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
